సరిహద్దుల్లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. పాకిస్థాన్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తుంది. శనివారం పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాన్ అమరుడయ్యాడు. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా బాలాకోట్ సెక్టార్‌లో చోటు చేసుకుంది.
జూలై 29న పాకిస్థాన్ మూకలు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. బారాముల్లా సరిహద్దుల్లో నియంత్రణా రేఖ వద్ద మోర్టార్లు, ఇతర ఆయుధాలతో కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇండియన్ ఆర్మీ పోర్టర్ మరణించారు.