రానున్న ఐదేళ్లలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. పలు అంతర్జాతీయ సంస్థలతో సహా మొత్తం 22 కంపెనీలు భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి సిద్దంగా ఉన్నారని ఆయన తెలిపారు. దీంతో మొత్తం 12 లక్షలు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) కింద దేశంలో రాబోయే ఐదేళ్లలో11 లక్షలకు కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ విడిభాగాలు తయారు కానున్నాయని తెలిపారు. పెగాట్రాన్, శాంసంగ్ , రైజింగ్ స్టార్ , ఫాక్స్ కాన్, విస్ట్రాన్ లాంటి అంతర్జాతీయ బ్రాండ్ల కూడా ఉన్నాయని.. వీటితో పాటు మరిన్న సంస్థలు ఈ పథకంలో భాగం కానున్నయని అన్నారు. మొత్త 22 కంపెనీలు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్నాయని చెప్పారు. అన్ని అనుకున్నట్టు జరిగితే.. 7 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి చేయనున్నామని చెప్పారు. ఈ పథకం ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహిస్తుందని, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాన్ని నెరవేరుస్తుందని భావిస్తున్నట్లు రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు.