వాహనదారులకు శుభవార్త..

Update: 2020-08-01 19:13 GMT

కొత్తగా కారు లేదా బైక్ కొనుక్కోవాలనుకుంటున్నారా.. హ్యాపీగా కొనేసుకోవచ్చు. ఎందుకంటే దేశంలో నేటి నుంచి కొత్త ఇన్సూరెన్స్ నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. దీంతో వాహనాల రేట్లు కూడా భారీగా తగ్గుతాయి. ఈ కొత్త ఇన్సూరెన్స్ నిబంధన ప్రకారం వినియోగదారులకు భారంగా మారిన లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను ఇన్సూరెన్స్ కంపెనీలు ఉపసంహరించుకోనున్నాయి. దీంతో వినియోగదారులు మూడు లేదా ఐదు సంవత్సరాల దీర్ఘకాలిక బీమా పాలసీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇకపై కారు లేదా బైక్ కొనాలనుకునే వారు మూడేళ్లు లేదా ఐదేళ్లకు కాకుండా ఒక ఏడాదికే వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అయితే ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఈ పాలసీని రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా వెహికల్ ధర కూడా తగ్గుతుంది.

Similar News