మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వం గెజిట్ కూడా విడుదల చేసిన నేపథ్యంలో అమరావతి రైతులకు న్యాయస్థానాలే దిక్కయ్యాయి. మహానగర నిర్మాణం కోసమే తాము గత ప్రభుత్వానికి భూములు ఇచ్చామని ఆ మాస్టర్ ప్లాన్ ను అమలు చెయ్యాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పాలనా వికేంద్రీకరణ, crda చట్టాలపై జులై 31న జారీ చేసిన గెజిట్ ను రాజ్యాంగ విరుద్ధమని వాటిని రద్దు చెయ్యాలని కోరుతూ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. మూడు రాజధానులు ఏర్పాటు చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని రైతు జేఏసీ చెబుతోంది.
2014 లో తమకు crda తో కుదిరిన ఒప్పందం ప్రకారమే రాజధాని నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తూనే అమరావతిలో పనులు ఆపేసిన విషయాన్నీ కూడా రైతులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిపుణుల కమిటీ పేరుతోనూ, హై పవర్ కమిటీ పేరుతోనూ నివేదికలు సిద్ధం చేసి వాటి ఆధారంగానే బిల్లులపై ముందుకు వెళ్లినందున వాటి ఆధారంగానే ఆ నివేదికలు చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని రైతు జేఏసీ కోరుతోంది.