ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. గతంలో తరహాలోనే ప్రభుత్వం నుంచి
అవరమైన తొడ్పాటు ఎన్నికల కమిషన్ కు లభిస్తుందని ఆశిస్తున్నాన్నట్టు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ క్యాంప్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించానన్నారు. బాధ్యతలు స్వీకరించిన విషయాన్ని జిల్లా కలెక్టర్లకు తెలియజేసినట్టు స్పష్టం చేశారు.