కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు కరోనా వైరస్ సోకింది. ఆదివారం ఆయనకు పరీక్షలు చేయగా, పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే వెల్లడించారు. తనకు కోవిడ్ -19 పాజిటివ్ వచ్చిందని కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప ఆదివారం సాయంత్రం ట్వీట్ చేశారు. తాను బాగానే ఉన్నప్పటికీ, వైద్యుల సలహా మేరకు ముందుజాగ్రత్తగా ఆసుపత్రిలో చేరుతున్నానని ముఖ్యమంత్రి చెప్పారు. తనతో ఇటీవల పరిచయం ఉన్న వారందరు సెల్ఫ్ దిగ్బంధం లోకి వెళ్లాలని సూచించారు.
గత కొన్ని వారాలుగా కనాటకాలో కోవిడ్ -19 కేసులు పెరుగుతూనే ఉన్నాయి, బెంగళూరు అర్బన్ జిల్లాలో ఆదివారం 2,105 తాజా కరోనావైరస్ కేసులు, 21 మరణాలు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసులలో 50 శాతానికి పైగా రాజధాని నగరం బెంగళూరులో ఉన్నాయి. నగరంలో ఇప్పటివరకు 59,501 కేసులు, కరోనావైరస్ కారణంగా 1,077 మరణాలు సంభవించాయి.