నేడు బాధ్యతలు చేపట్టనున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్

Update: 2020-08-03 08:58 GMT

హైకోర్టు చీవాట్లు, సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో జగన్‌ సర్కారు వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను పునర్నియమిస్తూ ఇటీవల పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేదీ ఉత్తర్వులు జారీ చేశారు. నేడు ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఉదయం 11.15 గంటలకు ఆయన బాధ్యతలు చేపడతారు. కొన్ని నెలలపాటు పోరాడిన నిమ్మగడ్డ ఎట్టకేలకు ప్రభుత్వంపై విజయం సాధించారు. నిమ్మగడ్డ పునర్నియామకంతో రాష్ట్ర ప్రజానీకం హర్షం వ్యక్తం చేసింది. ఆలస్యం అయినా న్యాయమే గెలిచిందని పలువురు ప్రజాస్వామ్య వాదులు వ్యాఖ్యానించారు.

Similar News