ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్‌లో సోమవారం జరగాల్సిన రక్షా బంధన్ (రాఖీ) వేడుకలను నిర్వహించడం లేదని గవర్నర్ కార్యాలయం తెలిపింది. కోవిడ్ ఎఫెక్ట్ కారణంగా ఈసారి రాఖి వేడుకలకు దూరంగా ఉండాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ నిర్ణయించారు. రాఖి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచంద్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు తమ ముఖాలకు మాస్కులు ధరించి,ఇంటి వద్దే వేడుకను జరుపుకోవాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు.