అమరావతి ఎంపి నవనీత్ రానా కౌర్ ఇంట కరోనా కలకలం రేగింది. నవనీత్ భర్త రవి రానా తండ్రి, ఆమె మామ గంగాధర్ రానాకు కరోనా భారినపడ్డారు. ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షలలో ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో రానా కుటుంబంలో దాదాపు 50 నుంచి 60 మంది సభ్యులు, కార్యకర్తలు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దీంతో నవనీత్ ఇంటిని వైద్య ఆరోగ్య శాఖ శానిటైజ్ చేసింది. అయితే.. నవనీత్ రానా, ఆమె భర్త రవిరానా శాంపిల్స్ లను వైద్యులు తప్పుగా తీసుకున్నట్లు సమాచారం. దీంతో వైద్యఆరోగ్య శాఖకు రవి రానా ఫిర్యాదు చేశారు.