సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్

Update: 2020-08-03 18:41 GMT

కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అవ్వడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. దీంతో అమిత్ షా.. తనతో సన్నిహితంగా ఉన్న వారంతా ఐసోలేషన్ లోకి వెళ్లాలని కోరారు. అలాగే, ఆయనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేసుకోవాలని వైద్యులు తెలిపారు. కాగా.. కరోనా గత శనివారం అమిత్ షాను రవిశంకర్ కలుసుకున్నారు. దీంతో, రవిశంకర్ హోం ఐసోలేషన్ కు వెళ్లారు. అయితే, రవిశంకర్ ప్రసాద్ ఆరోగ్యంగానే ఉన్నారన ఆయన కార్యాలయం తెలిపింది. అమిత్ షాను కలుసుకోవడంతో ముందు జాగ్రత్తగా ఐసోలేషన్ లోకి వెళ్లానని అన్నారు. అటు, పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో కూడా హోం ఐసోలేషన్ కి వెళ్తున్నట్టు ప్రకటించారు.

Similar News