మహారాష్ట్రలో కొత్తగా 231 మంది పోలీసులకు కరోనా పాజటివ్

Update: 2020-08-04 14:58 GMT

మహారాష్ట్రలో కరోనా స్వైర విహారం చేస్తోంది. పోలీసు శాఖలో ఈ మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 231 మంది పోలీసులకు కరోనా సోకింది. ఈ కరోనా మహమ్మారి కారణంగా ఒక్కరోజే ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ఆ రాష్ట్ర పోలీసు బలగాల్లో 9,934 మంది వైరస్‌ బారినపడ్డారు. కరోనా బారి నుంచి 7,950 మంది పోలీసులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 1,877 మంది వివిధ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 107 మంది పోలీసులు మృత్యువాత పడ్డారు. కాగా, మహారాష్ట్రలో ఇప్పటివరకు 4,56,196 మంది వైరస్‌ బారినపడ్డారు. 1,47,324 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. కరోనా బారిన పడి 15,842 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ మంగళవారం తెలిపింది.

Similar News