దేశంలో ఒక్కరోజే 52050 కరోనా పాజిటివ్ కేసులు

Update: 2020-08-04 13:58 GMT

దేశంలో కరోనా స్వైర విహారం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. కరోనా బారిన పడి ఒక్కరోజే దేశంలో 803 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశ‌వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 18,55,746కి చేరింది. దీంట్లో యాక్టివ్ కేసుల సంఖ్య 586298గా ఉంది. ఇక వైర‌స్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 1230510గా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మ‌ర‌ణించిన వారి సంఖ్య 38,938గా ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

Similar News