దేశంలో ఒకే రోజు 6.6 లక్షల కరోనా పరీక్షలు

Update: 2020-08-04 10:58 GMT

దేశంలో కరోనా విజృంభిస్తోంది. కరోనా నేపథ్యంలో వైరస్‌ నిర్ధారణ కోసం సర్కార్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో ఒకే రోజు 6.6లక్షలకు పైగా కరోనా టెస్టులు నిర్వహించారు. కోవిడ్-19కి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భారతదేశం గడిచిన 24 గంటల్లో 6,61,715 పరీక్షలను చేసిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 2,08,64,206 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, దేశంలో సోమవారం 52,972 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 18 లక్షలను అధిగమించిందని ఆరోగ్యశాఖ పేర్కొంది.

Similar News