కర్నాటకలో కరోనా కలకలం రేపుతోంది. రోజువారి నమోదవుతున్న కరోనా కేసులు కాస్తా ఉపశమనం కలిగిస్తున్నా.. కరోనా మరణాలు మాత్రం భారీగా నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 98 మంది కరోనా కాటుకి బలైయ్యారు. గడిచిన 24 గంటల్లో 4,752 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,39,571కి చేరింది. అటు, మరణాల సంఖ్య 2,594కి చేరింది.