వీడియో కాన్ఫెరెన్స్ లో భూమి పూజకు హాజరుకానున్న అద్వాణీ

Update: 2020-08-03 23:23 GMT

అయోధ్యలో రామమందిర భూమి పూజ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చాలా నిరాడంబరంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా 200 మంది ఆహ్వానితులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే, తరువాత ఈ సంఖ్యను తగ్గించి 170కి ఆహ్వానాలు పంపించారు. అయితే, ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలు ఎల్.కె.అడ్వాణి, మురళీ మనోహర్ జోషి పరోక్షంగా హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వయస్సు, ఆరోగ్య కారణాల రీత్యా ఈ ఇద్దరు అగ్రనేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమిపూజలో పాల్గొంటారని ఆ వర్గాలు తెలిపాయి.

కాగా.. ఆగస్టు 5న జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఆయనతోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, తదితరులు హాజరయ్యే అవకాశాలున్నాయి. ఆగస్టు 5వ తేదీన అయోధ్య దేదేప్యమానంగా వెలుగులీనేందుకు 1.25 లక్షల దీపాలు వెలిగించనున్నారు.

Similar News