ఏపీలోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అమరావతివాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో మంగళవారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు భారీ వర్షాలు కురుస్తాయని అమరావతివాతావరణ కేంద్రం తెలిపింది. బలమైన గాలులు వీస్తున్నందున కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ వాతావరణ కేంద్రం సూచించింది.