ముంబైలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

Update: 2020-08-04 14:38 GMT

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైతో పాటు తూర్పు కొంకణ్‌, థానే జిల్లాల్లో కూడా వానలు పడుతున్నాయి. భారీ వర్షాలు కారణంగా భారత వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. రానున్న 48 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం రాత్రి ఎడతెరిపి లేని వర్షం కురవడంతో ముంబైలోని పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి.

Similar News