అమిత్ షా కరోనా ట్రీట్‌మెంట్‌పై కాంగ్రెస్ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Update: 2020-08-03 19:56 GMT

కరోనా పాజిటివ్ వచ్చి.. మేదాంత్ ఆస్పత్రిలో చేరిన అమిత్ షా గురించి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా ప్రైవేట్ ఆస్పత్రికి బదులు ఎయిమ్స్ లో చేరి ఉంటే బాగుండేదని అన్నారు. ప్రభుత్వ సంస్థలకు ప్రముఖుల అండ ఉంటేనే.. ప్రజలకు వాటి మీద విశ్వాసం ఉంటుదని ఆయన ట్వీట్ చేశారు. అనారోగ్యంతో ఉన్న హోంమంత్రి అమిత్ షా ప్రైవేట్ ఆస్పత్రికి బదులు ఎయిమ్స్ లో ఎందుకు చేరలేదా అని తాను ఆలోచిస్తున్నాని అన్నారు. ప్రభుత్వ సంస్థలకు పెద్దల అండ అవసరం. అప్పుడే ప్రజల మన్ననలు ప్రభుత్వ సంస్థలు పొందగలవని ట్వీట్ చేశారు. కాగా.. అమిత్ షా కరోనా బారిన పడి గురుగావ్ లోని మేదాంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్తితి బాగున్నప్పట్టికీ.. వైద్యుల సలహా మేరకు ఆస్ప్రత్రిలో చేరారు.

Similar News