సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిన త్రిపుర సీఎం

Update: 2020-08-04 15:12 GMT

త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ దేవ్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. ఆయన కుటుంబ సభ్యులకు ఇద్దరికి కరోనా సోకడంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ కి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా చెప్పారు. తన కుటుంబంలో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయిందని.. అయితే, మిగిలిన వారికి మాత్రం నెగెటివ్ అని వచ్చిందని తెలిపారు. తాను కూడా పరీక్ష చేపించుకున్నానని.. ఇంకా రిజల్ట్ రాలేదని తెలిపారు. దీంతో తాను తన ఇంట్లోనే ఐసోలేషన్‌లోకి వెళ్లానని అన్నారు. కరోనా సోకిన తమ కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు ఆయన తట్వీట్‌ చేశారు.

Similar News