విప్లవకవి 'వంగపడు' కన్నుమూత

Update: 2020-08-04 12:19 GMT

ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు (77) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విజయనగరం జిల్లా పార్వతీపురం పెందబొందపల్లిలోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 1972లో జననాట్య మండలిని స్థాపించి పల్లెకారులతో పాటు గిరిజనులను చైతన్యపరిచారు. అర్థరాత్రి స్వాతంత్ర్యం సినిమాతో సినీప్రస్థానం ప్రారంభించారు. ఏం పిల్లడో ఎల్దమొస్తవ పాటతో జనాన్ని ఉర్రూతలూగించారు. ఉత్తరాంధ్ర గద్దర్ గా పేరుతెచ్చుకున్న వంగపండు 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కళారత్న పురస్కారం అందుకున్నారు. 30కి పైగా సినిమాలకు పాటలు రాశారు. ఆయన పాటలు 10 భాషల్లోకి అనువదించబడ్డాయి. మూడు దశాబ్దాలలో 300కు పైగా పాటలు పాడారు. వంగపండు మరణంపై ప్రజాగాయకుడు, విప్లవకవి గద్దర్ స్పందిస్తూ.. వంగపండు పాట కాదు ప్రజల గుండె చప్పుడు. అక్షరం ఉన్నంత వరకు వంగపండు ఉంటాడు. పాటను ప్రజల హృదయాల్లోకి, ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఘనత వంగపండుది అని పేర్కొన్నారు.

Similar News