వైసీపీ సీనియర్ నాయకుడు, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కరోనా భారిన పడ్డారు. మంగళవారం ఆయనకు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన వెంటనే చికిత్స కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం బాలినేని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఏపీలో కూడా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. మొదట్లో వందల్లో నమోదైన పాజిటివ్ కేసులు ఇప్పుడు పదవేలకు పైగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు 1,76,333కి చేరాయి.