YS Jagan : వైసీపీ అక్రమాలు.. సంక్షేమానికి ఆటంకం..

Update: 2026-03-02 09:31 GMT

వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతి పనులు ఇప్పటికీ ఏపీ ప్రజలను వెంటాడుతున్నాయి. ప్రతి స్కీమ్ లో స్కామ్ చేసిన చరిత్ర వైసీపీ నాయకులకే దక్కింది. పేద ప్రజలను దోచుకోడానికి ఎన్ని ఎత్తులు వేయాలో అన్నీ వేసేశారు మాజీ సీఎం జగన్. ఆయన హయాంలో జగనన్న ఇండ్ల పేరుతో చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కావు. పేదలకు ఇండ్ల కోసం వాగులు, వంకలు, చెరువు స్థలాలు, కుంటలు, పనికిరాని భూముల్లో స్థలాలను కేటాయించార వైసీపీ నాయకులు. మరీ దారుణం ఏంటంటే.. ఈపనికి రాని భూములను రైతుల నుంచి చాలా తక్కువ ధరలకే వైసీపీ నాయకులు కొనుగోలు చేశారు. ఆ తర్వాత వాటిని ఎక్కువ ధరలకు ప్రభుత్వానికే అమ్మేశారు. అంటే ఇక్కడ ఎంత సిండికేట్ మోసం జరిగిందో ఒకసారి చూడొచ్చు. వైసీపీ నాయకులకు ముందే సమాచారం ఇచ్చి రైతుల నుంచి తక్కువ ధరలకు భూములు కొనిపించారు.

ఆ తర్వాత వాటిని ప్రభుత్వం ఎక్కువ ధరలకు కొనుగోలు చేసింది. పోనీ ఆ భూముల్లో అయినా ఇండ్లు కట్టించారా అంటే అదీ లేదు. కేవలం బేస్ మెట్, రూఫ్‌ లెవల్లోనే ఇండ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. ఇప్పుడు వాటిని కూటమి ప్రభుత్వం కంప్లీట్ చేయాలని చూస్తున్నా చాలా సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే జగన్ హయాంలో ఇచ్చిన ఇండ్ల స్థలాల్లో ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, సీసీ రోడ్లు, తాగు నీటి సౌకర్యాలు ఏర్పాటు చేయలేని విధంగా ఉన్నాయి. వాగులు, వంకల్లో స్థలాలు ఇస్తే అక్కడ ఎలా ఈ సౌకర్యాలు కల్పించాలి అని కూటమి ప్రభుత్వం చెబుతోంది.

అలాగే వైసీపీ హయాంలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా దెబ్బ తిన్నది. కాబట్టి ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు లేదా ఇండ్ల నిర్మాణాలకు ఏపీ ప్రభుత్వం చాలా కష్టపడుతోంది. ఇంత చేస్తున్నా సరే ఇప్పటికీ కూటమి ప్రభుత్వం మీద వైసీపీ బురదజల్లడమే పనిగా పెట్టుకుంది. సంక్షేమ కర్యాక్రమాలను పేదలకు అందనివ్వకుండా వైసీపీ చేసిన పాపాలు ఇప్పటికీ ఈ విధంగా వెంటాడుతూనే ఉన్నాయి.

Tags:    

Similar News