కరోనా ప్రభావంతో 100 కోట్లమంది చదువులకు దూరం అయ్యారు: ఐక్యరాజ్యసమితి

Update: 2020-08-04 20:58 GMT

కరోనా ప్రభావం విద్యావ్యవస్థపై తీవ్రంగా పడిందని ఐక్యరాజ్యసమతి తెలిపింది. ప్రపంచంలో ఎప్పుడూ లేనంత ప్రతికూల ప్రభావం విద్యావ్యవస్థపై పడిందని పడిందని ఐక్యారాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్ వలన 160 దేశాల్లో మొత్తం 100 కోట్ల మందికిపైగా విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడిందన్నారు. మరోవైపు సుమారు నాలుగు కోట్లు మంది చిన్నారులు అత్యంత కీలకమైన ప్రాథమిక విద్యకు దూరమయ్యారని అన్నారు. ఈ కరోనా ప్రభావంతో ఒక జనరేషన్ మొత్తానికి చదువుల ఆటంకం ఏర్పడ్డాయని అన్నారు. కొన్ని దశాబ్దాలుగా సాధించిన అభివృద్థి మొత్తం వెనకపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఇప్పటికే చాలా అసమానతలు ఉన్నాయని.. ఇవి మరింత పెరిగే ప్రమాదం ఉందని అన్నారు. ఇన్ని అనార్థాలకు కరోనా మహమ్మారే కారణమని అన్నారు.

Similar News