రూ.400 కంటే తక్కువకే కరోనా టెస్ట్: ఐఐటీ ఖరగ్‌పూర్‌ సృష్టి

Update: 2020-08-05 14:59 GMT

గవర్నమెంట్ ఆస్పత్రిలో ఉచితంగా చేస్తారేమో కాని కరోనా టెస్ట్ కోసం ప్రైవేట్ ఆస్పత్రి గడప తొక్కాలంటేనే భయంగా ఉంటుంది.. ఆ ఫీజుల చార్ట్ ని చూసేసరికి గుండె వేగం పెరుగుతుంది. పాజిటివ్ లను గుర్తించాలంటే రివర్స్ ట్రాన్స్‌క్రిప్షన్‌ - పాలిమరేజ్ చైన్ రియాక్షన్ (ఆర్‌టీ- పీసీఆర్‌)పరీక్షలే ఏకైక మార్టం. వీటిని చేయించుకోవాలంటే భారీ మొత్తంలో ఆస్పత్రులకు సమర్పించుకోవాలి. ఈ భారీ ఫీజులకు చెక్ పెట్టేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ సుమన్ చక్రవర్తి ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం ఒక కిట్ ను రూపొందించింది. దీని ద్వారా కరోనా టెస్ల్ కు రూ.400 కంటే తక్కువ ఖర్చవుతుందని అంటున్నారు.

పరిశోధన మొదలు పెట్టినప్పుడు ఈ బృందం మూడు లక్ష్యాలతో ముందడుగు వేసింది. ఒకటి కొవిడ్ టెస్ట్ ఖర్చును తగ్గించడం.. రెండు ఫలితం కచ్చితంగా ఉండడం.. మూడు వీలైనంత వేగంగా ఫలితాన్ని వెల్లడించడం.. ఈ కిట్ ఈ మూడింటినీ సాధించగలిగిందని పరిశోధన బృందం తెలిపింది. కరోనాపై చేస్తున్న యుద్దంలో వచ్చే రెండు నెలలు కీలకమైనవి. సాద్యమైనన్ని ఎక్కువ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ కిట్లను భారీ సంఖ్యలో ఉత్పత్తి చేసేందుకు ప్రవేట్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నాయి పరిశోదన బృందాలు. చర్ఛలు ఫలిస్తే కిట్లు ప్రైవేట్ ఆస్పత్రులలో అందుబాటులోకి వస్తాయి.

Similar News