మహారాష్ట్ర కరోనా స్వైర విహారం చేస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. పోలీసు శాఖలో కరోనా కలకలం సృష్టిస్తోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 92 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో కరోనా మహమ్మారి బారిన పడ్డ వారి సంఖ్య బుధవారం నాటికి పదివేల మార్కును దాటింది. ఇప్పటి వరకు 10,026 మంది పోలీసులకు కరోనా సోకింది. ఇందులో 8,060 మంది కోలుకున్నారు. 1,859 కేసులు యాక్టివ్ కేసులు ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు మహారాష్ట్రలో 2,99,356 కరోనా వైరస్ నుంచి రోగులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.