ఫార్మా దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీస్ కోవిడ్ రోగులకు శుభవార్త అందించింది. మంగళవారం కోవిడ్ -19 రోగుల కోసం ఫ్లగార్డ్ పేరుతో టాబ్లెట్లను విడుదల చేసింది. ఈ టాబ్లెట్ ధర ఒక్కోటి రూ .35. ఈ ట్యాబ్లేట్లు తేలికపాటి కరోనా లక్షణాలతో ఇబ్బందిపడేవారికి సహాయపడతాయని సన్ ఫార్మాస్యూటికల్స్ తెలిపింది. ఈ టాబ్లెట్‌లో ఫావిపిరవిర్ 200 ఎంజి మోతాదు ఉంటుంది. కోవిడ్ -19 చికిత్సగా యాంటీ వైరల్ చికిత్స కోసం భారతదేశంలో అనుమతించబడిన ఏకైక ఔషధం ఫావిపిరవిర్. ఫావిపిరవిర్ డ్రగ్‌ను జపాన్ కంపెనీ ఫుజిఫిల్మ్ హోల్డింగ్ కార్ప్ పెద్ద ఎత్తున తయారు చేస్తుంది.