బంగారం ధరలు మరోసారి రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ ప్రైస్ పెరుతుండడంతో.. మన మార్కెట్లలో కూడా ధరలు పుంజుకుంటూనే ఉన్నాయి. ఎంసీఎక్స్‌లో ఒక కేజీ ఆగస్ట్ కాంట్రాక్ట్ గోల్డ్ ధర రూ. 54,200 కు చేరుకుని కొత్త రికార్డ్ సృష్టించింది. గ్లోబల్ మార్కెట్లలో కూడా గోల్డ్ డిసెంబర్ కాంట్రాక్ట్ ధర ఔన్స్‌కు దాదాపు 2000 డాలర్లను దాటింది.
ఇక మన దేశం విషయానికి వస్తే.. శ్రావణ మాసం ఎఫెక్ట్ కూడా కనిపిస్తోందని చెప్పాలి. రీటైల్ మార్కెట్లలో బంగారం ధర రోజుకో రికార్డు నమోదు చేస్తూ దూసుకుపోతోంది. కరోనా కారణంగా కొంతకాలంగా అమ్మకాలు, డిమాండ్ నిలిచిపోగా.. ప్రస్తుతం శ్రావణ మాసం కావడంతో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఇది స్టాకిస్టుల నుంచి కొనుగోలుదారుల వరకూ బంగారం కొనుగోళ్లకు ప్రోత్సాహించేలా చేస్తోంది.
ప్రస్తుతం హైదరాబాద్ రీటైల్ మార్కెట్లో 24 కేరట్ మేలిమి బంగారం ధర రూ. 56810 పలుకుతోందంటే.. గోల్డ్ ప్రైస్ ఏ స్థాయిలో దూసుకుపోతోందో అర్ధమవుతుంది. 22 కేరట్ బంగారం రూ. 52080కి చేరింది. కిలో వెండి ధర రూ. 62 వేలకు చేరుకుంది.