ప్రపంచానికి దిశానిర్దేశం శక్తిగా భారత్ రానున్న కాలంలో మారుతుందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణ భూమిపూజ జరుగుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ మేరకు ఆశాభావం వ్యక్తం చేశారు. భూమి పూజ సందర్భంగా దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడి ఆశీర్వాదం మనకు కలగాలని ఆయన కోరారు. అయోద్య రాముడి దీవెనలతో దేశంలో ఆకలి, నిరక్షరాస్యత, పేదరికం పూర్తిగా నిర్మూలన అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాముడి ఆశీస్సులతో దేశం ప్రపంచంలోనే శక్తివంతంగా అవతరిస్తుందని ట్వీట్ చేశారు. చివరిగా జై శ్రీ రామ్! జై బజరంగ్ బళి!... అని రాశారు.