ప్రధాని మోదీ రామాలయ భూమి పూజకు ప్రత్యేక జెట్ విమానంలో బయలుదేరారు. బుధవారం ఢిల్లీ విమానాశ్రయంలో లక్నోకు చేరుకుంటారు. అయోధ్య రామాలయం భూమి పూజకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఆయన.. పట్టుపంచె, పొడగు కుర్తా ధరించి.. మెడలో పట్టువస్త్రాన్ని వేసుకున్నారు. లక్నో చేరుకున్న తరువాత ప్రధాని మోదీ సంప్రదాయబద్ధ వస్త్రధారణలో హెలికాప్టరులో అయోధ్యలోని సాకేత్ కళాశాల హెలిప్యాడ్ లో దిగనున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక కాన్వాయ్ లో రామాలయం భూమి పూజా స్థలానికి చేరుకుంటారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, రామమందిర ట్రస్టు చీఫ్ నృత్య గోపాల్ దాస్, యూపీ రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ లు హాజరుకానున్నారు.