కరోనా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. 8మంది మృతి

Update: 2020-08-06 10:33 GMT

గుజరాత్‌లోని కరోనా ఆస్ప్రత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అహ్మదాబాద్ లోని కరోనా ఆస్పత్రిలో గురువారం తెల్లవారు జామున జరిగిన అగ్నిప్రమాదంలో 8మంది మరణించారు. నవరంగపురా ప్రాంతంలోని శ్రేయా ఆసుపత్రిలోని 4వ అంతస్తులో ఉన్న ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో తెల్లవారుజామున 3 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐసీయూలో ఉన్న 8మంది కరోనా రోగులు అక్కడిక్కడే సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఐదుగురు పురుషులు కాగా.. ముగ్గురు మహిళా రోగులున్నారు. ఈ ప్రమాదం సంభవించడంతో శ్రేయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 40 మంది ఇతర రోగులను ఎస్వీపీ ఆసుపత్రికి తరలించారు.

Similar News