దేశంలో కరోనా విజృంభిస్తుంది. దీంతో ప్రభుత్వాలు కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కాగా.. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 67.19కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. అటు, మృతుల శాతం 2.09కి తగ్గిందని వివరించింది. దేశంలో ఇప్పటివరకూ 19,08,255 కరోనా కేసులు నమోదు కాగా.. ఇందులో 5,86,244మంది మాత్రమే చికిత్స పొందుతుండగా.. 12,82,216 పూర్తిగా డిశ్చార్జి అయ్యారు. అటు, మృతుల సంఖ్య 39,795కి చేరినట్టు ఆ ప్రకటన పేర్కొంది.