కరోనా వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ఫార్మాకంపెనీలు ప్రపంచవ్యాప్తంగా నిమగ్నమయ్యాయి. అటు, భారత్‌లో కూడా పలు కంపెనీలు కరోనా వ్యాక్సిన్ లో కీలక దశలో ఉన్నాయి. కాగా.. భారత్ కు చెందిన ఫార్మా కంపెనీ జైడస్ కాడిలా తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో రెండో దశకు చేరుకుంది. మొదటి దశ ట్రయల్స్ లో ఆశించదగిన ఫలితాలు వెల్లడయ్యాయి. దీంతో గురువారం నుంచి రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనుంది.
జైడస్ కాడిలా చైర్మన్ పంకజ్ ఆర్ పటేల్ మాట్లాడుతూ జైకోవ్-డి మొదటి దశ హ్యమన్ ట్రయల్స్‌లో టీకా సురక్షితమైదని తేలిందన్నారు. కాగా జైడస్ కాడిలా ప్రభుత్వం నుంచి కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్‌కు అనుమతి పొందింది. దీనికిముందు కోవిడ్ -19 వ్యాక్సిన్ కోవాక్సిన్‌ను పరీక్షించడానికి ఇండియా బయోటెక్ అనుమతి పొంది, హ్యూమన్ ట్రయల్స్ నిర్వహిస్తోంది.