అరుణాచల్ ప్రదేశ్‌లోని గురువారం భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తవాంగ్ కు 42 కిలోమీటర్ల దూరంలో ఇది చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై 3.0 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయని జాతీయ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఇంట్లోనుంచి బయటకు పరుగలు తీశారు. అయితే, తక్కవ తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఎలాంటి ప్రాణ నష్టం, ప్రాణ నష్టం జరగలేదు. దీంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల వరుసగా ఈశాన్య, ఉత్తర భారతదేశంలో భూకంపం సంభవిస్తుంది. గత నెల మిజోరాం, నాగాలాండ్, మణిపూర్, సిక్కిం రాష్ట్రాల్లోని పలు చోట్ల భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఓ వైపు కరోనా.. మరోవైపు భూకంపం ఈశాన్య రాష్ట్రాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది.