భారత్ అంతర్గత విషయాల్లో తలదుర్చుతున్న చైనాకు భారత్ మరోసారి గట్టిగా సమాదానం చెప్పింది. దేశ అంతర్గత విషయంలో జోక్యం చేసుకోవద్దని హితవు పలికింది. జమ్మూ కశ్మీర్ అంశంలో పదేపదే తలదూర్చి అబాసుపాలైనా.. బుద్దిరాని చైనా.. మరోసారి అలాంటి ప్రయత్నాలు చేసేందుకు సిద్దమైంది. జమ్మూ కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితిలో చర్చించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. దీనిపై భారత్ ఘాటుగా స్పందించింది. భారత కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్ గురించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ)లో చర్చను లేవనెత్తేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాల గురించి తమ దృష్టికి వచ్చిందని విదేశాంగశాఖ పేర్కొంది. అయితే, ఇది పూర్తిగా.. తమ దేశ అంతర్గత విషయమని.. ఈ విషయంలో ఇప్పటికే పలు సార్లు తలదూర్చి.. అంతర్జాతీయ వేదికలపై చైనాకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసింది. మరోసారి ఇలాంటి ప్రయత్నాలు మానుకుంటే మంచిదని బదులు చెప్పింది.
కాగా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసిప్పటి నుంచి పాక్.. భారత్ పై అక్కసు వెళ్లగక్కుతుంది. గత ఏడాది ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని కోరుతూ లేఖ రాసింది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు భారత్ కు మద్దతు పలకడంతో పాక్ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అయితే, చైనా మాత్రం పరోక్షంగా పాక్ కు మద్దతు ప్రకటిస్తుంది. ఆర్టికల్ 370ను రద్దు చేసి ఏడాది అయిన సందర్భంగా చైనా.. పాక్ కు మద్దతుగా.. ఈ వ్యవహారంపై కుట్రలకు లేపుతుంది.