కేరళలోని ఇడుక్కి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో కొండచరియలు విరిగిపడటంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారు. పర్యాటక పట్టణమైన మున్నార్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమలై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో 70 నుంచి 80 మంది
మధ్య నివసిస్తున్నట్టు అధికారులు తెలిపారు, వరద నీటిలో కొంతమంది చిక్కుకున్నారని తెలిపారు. వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇదిలావుంటే కేరళలోని ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిస్సూర్, పాలక్కాడ్, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్గోడ్ లకు శుక్రవారం ఆరెంజ్ హెచ్చరిక జారీ చేశారు. మలప్పురంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ.