తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదంపై కేంద్రం స్పందించింది. రెండు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ లకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్ లేఖలు రాశారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి అభ్యంతరాలున్న ప్రాజెక్టులపై ముందుకు వెళ్లోద్దని ఆ లేఖలో ప్రస్తావించారు. అలాగే కొత్త ప్రాజెక్టులపై డీపీఆర్ లు ఇవ్వలేదని తమ అజెండాను ఇవ్వకుండా ఉద్దేశ్యపూర్వకంగా కాలయాపన చేయడం సరికాదని సూచించారు.