విజయవాడ అగ్నిప్రమాదంలో మృతుల కుటుంబాలకు అరకోటి పరిహారం

Update: 2020-08-09 12:22 GMT

విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది. సంఘటనా స్థలంలోనే ముగ్గురు చనిపోగా.. ఇప్పుడు మృతుల సంఖ్య 11కి చేరింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఆ కోవిడ్ సెంటర్ లో చికిత్స పొందుతున్న వారిని పలు ఆస్పత్రులకు తరలించారు. కాగా.. ఈ ఘటనపై స్పందించిన ఏపీ సీఎం.. ప్రమాదానికి కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అగ్ని ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయాలైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

Similar News