తెలంగాణలో 80వేలు దాటిన కరోనా కేసులు

Update: 2020-08-10 11:25 GMT

తెలంగాణలో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,256 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు సోమవారం వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 389 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 80,751కు చేరింది. ఇక కరోనా భారిన పడి మరో 1,587 మంది

సంపూర్ణంగా కోలుకొని డిశ్చార్జ్‌ కాగా.. ఇప్పటివరకు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 57,586 కు చేరింది. ఇక కరోనాతో కొత్తగా మరో 10 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో మరణాల సంఖ్య 637కు పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో 22,528 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Similar News