పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర ఒడిషా, పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలోని వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. అంతేకాదు
ఈ అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో సోమవారం కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ విభాగం వెల్లడించింది. అల్పపీడనం కారణంగా కోస్తా తీరం వెంబడి సోమ, మంగళవారాల్లో బలమైన ఈదురు గాలులు వీచే సూచనలు కనిపిస్తున్నాయని.. అందువల్ల మత్స్యకారులెవ్వరూ సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.