పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు అందించారలని సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ నిర్ణయించారు. ఈ నెల 12వతేదీన లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలోని 26 ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లను అందిస్తారు. గతంలోనే ప్రభుత్వం.. ఇంటర్ విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా స్కూల్స్, కాలేజీలు ఇంకా మొదలు కాలేదు. అందరికీ ఆన్లైన్ క్లాసులు అవుతున్నాయి. దీంతో విద్యార్థులు క్లాసులు వినడానికి ఇబ్బందులపు పడుతున్నారు. దీంతో ఆగస్టు 12వతేదీన అంతర్జాతీయ యువ దినోత్సవం కూడా రావడంతో ఆ సందర్భంగా స్మార్ట్ ఫోన్ల పంపిణీ చేయాలని నిర్ణయించారు. మొదటి దశ కింద రాష్ట్రంలో 1.75 లక్షల మంది విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీనిలోభాగంగా 50వేల ఫోన్లను ఇప్పటికే తెప్పించారు.