ప్రధాని మోదీకి హాని తలపెడతానని ఫోన్ కాల్

Update: 2020-08-11 09:40 GMT

ప్రధాని మోదీకే హాని తలపెడతానని ఓ యువకుడు బెదిరించాడు. హర్యానాకు చెందిన హర్భజన్ సింగ్ అనే వ్యక్తి పోలీస్ ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్ 100కి ఫోన్ చేసి.. ప్రధాని మోదీకే హాని తలపెడతానిని బెదిరించాడు. హర్యానాకు చెందిన హర్బజన్ సింగ్ యూపీలోని నోయిడాలో ఉంటున్నాడు. దీంతో నోయిడా ఫేజ్ 3 పోలీసులు హర్భజన్ సింగ్ ను పట్టుకొని ప్రశ్నిస్తున్నారు. అయితే పోలీసుల విచారణలో ఆయన మాధక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడని తేలింది. దీంతో అతన్ని ప్రశ్నించి వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి పంపించామని నోయిడా అదనపు డీసీపీ అంకూర్ అగర్వాల్ చెప్పారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి మోదీని ఫోన్ లో బెదిరించిన యువకుడి ఘటన నోయిడాలో సంచలనం రేపింది.

Similar News