మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సోమవారం అస్వస్థతతో ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రికి వెళ్లిన ప్రణబ్ కు మెదడులో రక్తం గడ్డకట్టిందని పరీక్షలలో తేలడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ప్రణబ్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు పరీక్షలో తేలింది. రక్షణమంత్రి రాజ్ నాధ్ సింగ్ ఆసుపత్రికి వెళ్లి ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.