ఆసియాలో అతిపెద్ద మురికివాడ అయిన ధారవిలో మొదట కరోనా కేసులు, మరణాలు భారీగా నమోదైన సంగతి తెలిసిందే. అయితే గత 10 రోజులుగా కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టింది. అంతేకాదు ఈ పది రోజులుగా ఒక్క మరణం కూడా సంభవించలేదని అధికారులు చెబుతున్నారు. అయితే మంగళవారం ఇక్కడ 24 కేసులు నమోదయ్యాయి. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ గణాంకాల ప్రకారం ధారవిలో ఇప్పటివరకు 2634 కేసులు నమోదయ్యాయి.
ఇందులో 2295 మంది రోగులు కోలుకున్నారు. దాంతో ఇప్పుడు 81 క్రియాశీల కేసులు మాత్రమే ఉన్నాయి. మొత్తం 258 మంది మరణించారు. మరోవైపు, covid19india.org దేశంలో కరోనా రోగుల సంఖ్య 23 లక్షల 28 వేల 405 కు పెరిగింది. మంగళవారం 61 వేల 252 మంది రోగులు పెరిగారు. అదే సమయంలో, 835 మంది మరణించారు.