మరో మూడు రోజులు భారీ వర్షాలు..

Update: 2020-08-14 13:26 GMT

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రానున్న మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. బంగాళఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలకు సమీపంలో గురువారం ఉదయం అల్పపడీనం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల శుక్ర, శని, ఆది, సోమవారాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

భారీ వర్ష సూచన ఉన్న జిల్లాలు

ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ అర్భన్, గ్రామీణం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట.

Similar News