ఈ ఏడాది ఇప్పటి వరకూ 868 మంది వరదల వలన ప్రాణాలు కోల్పోయారని కేంద్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. జూలైలో బీహార, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు సంభవించాయి. అటు, ముంబై, కొంకణ్, కర్ణాటకలో ఆగస్టు మొదటివారంలో వరదలకు పలు ప్రాంతాలు ప్రభావితం అయ్యాయి. ఈ నెల కేరళలోని ఇడుక్కిలో భారీ వర్షాలకు జనజీవనం స్థంభించింది. ఇడుక్కిలో కొండచరియలు విరిగిపడి పలువురు మృత్యువాత పడ్డారు. మొత్తం దేశంలో 11 రాష్ట్రాల్లో ఇప్పటివరకూ 868 మంది చనిపోయారు. గత ఏడాది ఇదే సమయానికి వరదలకు 908 మంది మరణించారు. కాగా.. ఈ నెల రెండో వారంలో రుతుపవనాలు అధిక ప్రభావాన్ని చూపాయి. దీంతో దేశంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 19 న బెంగాల్ తీరంలో మరో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తుంది.