రజినీ బాలయ్య ఆత్మీయ ఆలింగనం
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు విచ్చేసిన సూపర్ స్టార్;
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల అంకురార్పణ సభలో పాల్గొనేందుకు సూపర్ స్టార్ రజినీకాంత్ విజయవాడ చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో రజనీకాంత్‌కు నందమూరి బాలకృష్ణ స్వాగతం పలికారు. ఇరువురూ బాలయ్యను రజనీకాంత్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఎలా ఉన్నారంటూ పరస్పరం ఇద్దరూ పలకరించుకున్నారు. గన్నవరం నుంచి ఒకే కారులో రజనీకాంత్-బాలయ్య విజయవాడలోని నోవాటెల్ హోటల్‌కు వెళ్లారు.