ఉద్యోగుల మధ్య జగన్ ప్రభుత్వం చిచ్చుపెడుతోంది : బొప్పరాజు

Update: 2023-05-14 11:21 GMT

ఉద్యోగుల మధ్య జగన్ ప్రభుత్వం చిచ్చుపెడుతోందన్నారు ఉద్యోగ సంఘాల అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి రూ.2వేల కోట్లు సరెండర్స్ రావాలన్న ఆయన.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధముతున్నారని చెప్పారు. ఈనెల 17 నుంచి దశలవారీగా శాంతియుత ఉద్యమాలు చేపట్టి.. ఈనెల 30 తర్వాత మరో పెద్ద ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. మరో చలో విజయవాడ లాంటి ఆలోచన రాకముందే ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు బొప్పరాజు వెంకటేశ్వర్లు.

Similar News