ఏపీలో కొత్తగా 173 కరోనా కేసులు!
ఏపీలో కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 46,852 టెస్టులు చేయగా, 173 కరోనా కేసులు నమోదయ్యాయి.;
ఏపీలో కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 46,852 టెస్టులు చేయగా, 173 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,86,418కి చేరింది. ఇందులో 1,637 యాక్టివ్ కేసులుండగా, 8,77,639మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనాతో ఎలాంటి మరణం సంభవించలేదు. ఇప్పటివరకు రాష్ట్రంలో కొవిడ్‌తో 7,142 మంది మరణించారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,26,90,165 పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.