AP Coronav cases : ఏపీలో కరోనాతో 109 మంది మృతి..!
AP Coronav cases : ఏపీలో కరోనా విధ్వంసం తగ్గట్లేదు. రాష్ట్రంలో రోజువారీ మరణాలు భారీగా పెరిగాయి. తాజాగా గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 18,561 కేసులు నమోదయ్యాయి.;
AP Coronav cases : ఏపీలో కరోనా విధ్వంసం తగ్గట్లేదు. రాష్ట్రంలో రోజువారీ మరణాలు భారీగా పెరిగాయి. తాజాగా గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 18,561 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే.. కేసుల సంఖ్య తగ్గినా.. మరణాల సంఖ్య కలవరపెడుతోంది. ఒక్కరోజులోనే 109మంది కరోనాకు బలైపోయారు. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 14,54,052కు చేరింది. ఇక, మొత్తం మరణాల సంఖ్య 9,481 దాటింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2 లక్షల 11 వేల యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో 1,80,49,054 కరోనా టెస్టులు చేశారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.