Road Accident: భవానీ భక్తులను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి
Road Accident: కాకినాడ జిల్లా తుని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.;
Road Accident: కాకినాడ జిల్లా తుని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి నడుచుకుంటూ వెళ్తున్న భవానీ భక్తులను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు శ్రీకాకుళం జిల్లా పెనసం గ్రామానికి చెందిన ఈశ్వరరావు, సంతోష్ గా గుర్తించారు. వీరు పాదయాత్ర చేపట్టి విజయవాడకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాద దృష్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేశారు.